Tuesday, June 12, 2018

గ్రంధాలయ నిర్వహణ –కొన్ని విషయాలు



గ్రంధాలయ నిర్వహణ –కొన్ని విషయాలు

          జిల్లా గ్రంధాలయ సంస్థ సిబ్బంది గ్రంధాలయ నిర్వహణలో ఈ దిగువ ఉదాహరించిన నియమాలను విధి గా పాటించవలెను.
1.భాద్యతతో,చిత్తశుద్దితో, ఓర్పుతోగ్రంధాలయాని ప్రయోజనకరoగా నిర్వహించావాలనే ,విజ్ఞానకేంద్రంగా
    తీర్చిదిద్దివలెను.
2.గ్రంధాలయ సంస్థ తన ఉప నిబంధనలలో రూపొందించిన సెలవుదినములు , పని వేళల ప్రకారం  గ్రంధాలయాలను  తెరువవలెను .
3. i.  రెండుపూటల హాజరుపట్టికలో సంతకం చేయవలెను. అపట్టికలో సెలవుల వివరం వ్రాయవలెను.
ii. నిర్ణితవేళలకు , గ్రంధాలయానికి ఆలస్యంగా వస్తే సదరు ఆలస్యాన్ని హాజరు పట్టికలో నమోదు    చేయవలెను
iii.ఒక నెలలో మూడు పర్యాయములు ఆలస్యంగా వస్తే ఒక సాధారణ సెలవును కోల్పోతారు. సాధ్యమైనంత ముందుగా సాదారణ సెలవును పంపవలెను.
iv.సెలవు దరఖాస్తు స్వంతపోస్టేజి తో సర్తిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ తో సమర్పించవలెను .
v. పుస్తకాల విభాగం ముస్తే అ విషయం నోటిసుబోర్డు మీద వ్రాయాలి.
vi సాధారణ సెలవుల రిజిస్టర్ నిర్వహించావలెను ,సెలవు దరఖాస్తు సంస్థ కార్యాలయమునకు పంపేటపుడు ఉద్యోగికి సెలవు ఎంత నిల్వయున్నది ,ప్రస్తుతం కోరిన సెలవు ,ఇంకా ఎన్ని సెలవులు మిగిలినవి తెలుపవలెను.
vii. ఆర్జితసెలవు కనీసం 15 రోజుల ముందుగా సమర్పించవలెను సెలవు మంజూరు అయ్యాకె వాడుకోవాలి ,
1.       అన్ని పట్టికలు,ఉత్తరాలు తెలుగులోనే వ్రాయాలి. ఉత్తరప్రత్యుత్తరాలు కార్యదర్శి వారికే వ్రాయాలి ,కార్యాలయ రెఫరెన్స్ వుంటే విధిగా పేర్కొనాలి కోరిన సమాచారం సత్వరం పంపాలి. గ్రంధాలయానికి వచ్చే ఉత్తరాలు ఏరోజుకారోజు పట్టికలో నమోదు చేయాలి.
2.       ఈ దిగువన తెలిపిన నివేదికలను నిర్ణిత గడువులోపల గ్రంధలయ సంస్థ కార్యాలయానికి సమర్పించాలి.
ప్రతి నెల చివరి రోజు
1.       తెలుగు అధికారభాష నివేదిక
2.       నెలసరి ప్రగతి సమీక్షా పట్టికలు
3.       బుక్స్ ఆన్ డిమాండ్ పట్టిక వివరములు
4.       ట్రేజరీ చెలానా వివరములు
 ప్రతి మార్చి ,జూన్ ,సెప్టెంబర్ ,డిసెంబర్ నెలల చివరిరోజు
1.       అభివృద్ధి నివేదిక
2.       వర్గీకరణ – సుచీకరణ
మార్చి అంతంలో సమర్పించాలిసిన వార్షికనివేదిక
1.       పరిపాలన నివేదిక
2.       ఆదాయపు పన్ను సమర్పించుట (ఫిబ్రవరి నెల అంతం లో )
౬తగిన కారణం లేకుండా ముందుగా అనుమతి లేకుండా ప్రధాన కర్యాలయంకు రాకూడదు .


Monday, February 12, 2018

జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయ ఉద్యోగుల జాబ్ జ్హర్ట్

                                                                 జాబ్ చార్ట్ : జిల్లా గ్రంధాలయ సంస్థ
జిల్లా కేంద్ర గ్రంధలయదికారి/కార్యదర్శి;-
          జిల్లా గ్రంధాలయ సంస్థ మరియు జిల్లా కేంద్ర గ్రంధలయముకు ప్రధాన కార్యనిర్వహకునిగా ఉండును .
1.       వివిధ గ్రంధాలయ సిబ్బంది ఫై పుర్తి పర్యవేక్షణ కలిగి ఉండును
2.       జిల్లా గ్రంధాలయ సంస్థ క్రింద పనిచేస్తున్న మొత్తం సిబ్బంది జితభత్యములు చెల్లించు అధికారం కలిగివుండును
3.       జిల్లా గ్రంధాలయ సంస్థ నిర్వహించు అన్ని ఆర్థిక ,గణాంకల కు భాద్యత వహిచును
4.       జిల్లా గ్రంధాలయ సంస్థ లో చదువరులకు కావలసిన అన్ని రకాల సేవలూ అందించడానికి కృషి చేస్తారు
5.       జిల్లా గ్రంధాలయ సంస్థ నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు కార్యదర్శి కన్వీనర్ హోదాలో అజెండా ను తయారుచేయడం తీర్మానాలను తీసుకోవడం తీర్మానాలను అమలుపరచడాని భాద్యతగా తీసుకుంటాడు
6.       స్థానిక సంస్థల నుండి జిల్లా గ్రంధాలయ సంస్థకు చెల్లించవలసిన గ్రంధాలయ సెస్సు వాసులు చేయవలసిన భాద్యతను కలిగివుండును
7.       సంచాలకుల వారికి జిల్లా గ్రంధాలయ సంస్థ అభివృద్ది నివేదికలను పంపడం
8.       గ్రంధాలయాల కోసం స్థలాలను సేకరించడం ,భవనాల నిర్మాణం చేయడం, గ్రంధాలయ అభివృద్ధి లో భాగంగా చదువరులకు కావలసిన సేవలు అందించడం వీరి కర్తవ్యం
9.       కార్యనిర్వహణలో  భాగంగా వివిధ గ్రంధాలయాలను ఆకస్మిక తనికీలను నిర్వహించడం ,సంవత్సరిక పూర్తి స్థాయి తనిఖీలను నిర్వహించడం
10.   గ్రంధాలయ అభివృద్ధి లో భాగంగా సంచాలకుల వారికి వివిధ అధికారులకు ఉత్తరప్రత్యుత్తరాలను నిర్వహించడం
11.   పుస్తక ఎంపిక కమిటికి కార్యదర్శిమెంబర్ /కన్వినర్ గా వ్యవహరిస్తారు కమిటిని సమావేశకు కావలసిన అజెండాను తాయారు చేయడం చేర్చించిన తర్వాత తీర్మానాలను ఆమోదింప చేయడం .
12.   జిల్లా గ్రంధాలయ సంస్థ లో పనిచేసున్న ఉద్యోగులకు వివిధ రకాల శెలవులు, ఇంక్రిమెంట్లు, మంజూరు చేయడం విదినిర్వహణలో అలక్ష్యం చేసే ఉద్యోగుల ఫై తగిన చర్యలు తీసుకోవడం 
13.   గ్రంధాలయాలకు అవసరమగు వస్తువులను కొనుగోలు కోసం ఉన్నత అధికారుల అనుమతితో కొనుగోలు చేయు అధికారం కలదు.
14.   సంవత్సరిక బడ్జెట్ను తయారుచేయడం  సంవత్సరాoతములో ఆడిట్ జరిపే సిబ్బందికి జిల్లా గ్రంధాలయ సంస్థ నిర్వహించిన అన్నిరకాల రికార్డులను అందించడం ఆడిట్ చేఇంచి ఆడిట్ చేసిన రికార్డ్ల మేరకు అబ్యంతరాలు వుంటే చర్యలు తెసుకోవలసిన భాద్యత కలదు






సూపరిడెండేటెంట్ :-( ఈ పోస్ట్ గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థలో వుండేది ఇప్పడు లేదు)
1.       జిల్లా గ్రంధాలయ సంస్థ నిర్వహణలో కార్యదర్శి గారికి అన్ని పనుల్లలో సహకారిగా వుండటం
2.       వచ్చిన తపాలాను వివిధ సెక్షన్ లకు పంపడం
3.       వివిధ సెక్షన్ లలో ఉద్యోగులు తయరు చేసిన ఆఫీసు నోట్ ఫైల్ ఫై ప్రక్క సంతకం చేయడం
4.       వివిధ సెక్షన్ ఉద్యోగులకు విధులను కేటాయించoడం ,కేటాయించిన విదులను సక్రమంగా జరిగేటట్లు పర్యవేక్షణ చేయడం .
5.       నిర్ణిత వేళలలో పంపవలసిన నివేదికలు ఉత్తరప్రత్యుత్తరాలను పంపడం
6.       కార్యదర్శి గారికి పరిపాలన ,నిర్వహణ వ్యవహారాలలో సహాయకారిగా ఉండటం మరియు కార్యదర్శి గారు కేటాయించిన ఇతర పనులను చేయడం
సీనియర్ అసిస్టెంట్ :-
1.       ఇతను కార్యదర్శి కి , సూపరిడెండేటెంట్ కు సహాయకారిగా ఉండటం
2.       సిబ్బoకి కి సంబందించిన అన్ని రకాల రిజిస్టార్లూ ,ఫైల్స్ , సర్వీసురిజిస్టర్లు పనికిరి వస్తువుల తొలిగింపు రిజిస్టర్లు , సిబ్బంది ఫై క్రమశిక్షణచర్యలు తీసుకొన్న ఫైల్స్ , జిల్లా గ్రంధాలయ సంస్థ సమావేశాలకు సంబందించిన రిజిస్టర్లు ,జమ,ఖర్చుల నిర్వహణ కు సంబందించిన రిజిస్టర్లు ,స్టాక్ ఫైల్స్ సిబ్బంది జీతాలు ,జీతలగ్రాంట్ ,పించన్ గ్రాంట్ ,అన్ని రకాల కొనుగోలు రిజిస్టర్లూ , అన్ని రకాల ఓచర్లు ,రశీదులు, నగదు నిర్వహణ పుస్తకము , సంవత్సరిక బడ్జెట్ తయారుచేయడంలో కార్యదర్శి కి సహాయకారిగా పనిచేయడం కార్యదర్శి గారు అప్పగించిన ఇతర పనులు చేయడం.
జునియర్ అసిస్టెంట్ :-
1.       కార్యదర్శికి సేనియర్ అసిస్టెంట్ కి సహాయకారిగా పనిచేయడం
2.       జిల్లా గ్రంధాలయ సంస్థ కు సంబందించిన పరిపాలన మరియు గణాంకాలూ, సంవత్సరిక తనిఖీలు ,నెలవారీ కార్యదర్శి వారు తనఖిలు నిర్వహించే టూర్ మ్యాపులు తయారుచేయడం ,ఎయీడెడ్ గ్రంధాలయ రికార్డుల నిర్వహణ , సిబ్బందికి  ఇచ్చిన అప్పులు, అడ్వాన్స్ లూ వసులు చేయు రిజిస్టర్లు , జాతీయ గ్రంధాలయ వారోత్సవాల నిర్వహణకు సంబందించిన ఫైల్స్ , గ్రంధాలయ భవన నిర్మాణం, మరమత్తులు , గణాంకాల నివేదికలు తయారుచేయడం గ్రంధాలయం నుండి వచ్చిన నెలసరి ప్రగతి సమీక్షాపట్టికలు, మూడు నెలల ప్రగతి నివేదికలు ,పుస్తకాల నిల్వ సరిచూచు పట్టిక ,ఎ.డి. ఆర్ నివేదికలు ఫైల్ చేయడం కార్యదర్శి గారు చెప్పిన ఇతర పనులు చేయడం.
టైపిస్ట్ :-
1.       అన్ని రకాల టైపింగ్ పనులు చేయడం (రోజుకి టైపింగ్ 25 పేజీలు చేయడం )
2.       టైపింగ్ పనులకు సంబందించిన నకలు ఫైల్ చేయడం
3.       ఆఫీసుకు సంబందించిన , కార్యదర్శి అప్పగించిన పనిని చేయడం


రికార్డ్అసిస్టెంట్:-
1.       తపాలకుసంబందించినపనినినిర్వహిస్తారు,రికార్డ్రూమ్,స్టాక్రూమ్ ,ఇతనిపర్యవేక్షణలోఉంటుంది .మరియుఇతనికికార్యదర్శిఇచ్చినపనినిసక్రమంగానిర్వహిస్తారు.
అటెండర్:
1.       -ఇతను ప్రధానమైన భాధ్యత వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు సహాయకుడిగా వుంటూ ఒకసెక్షన్నుండి మరొక సెక్షన్  ఫైల్స్ అందించడo
2.       దుమ్ము ,ధూళి ,లేకుండాఆఫీసునుశుభ్రంగాఉంచడం
3.       స్థానికంగాఉన్నఇతరకార్యాలయాలకుతపాలానుఅందించడంమరియుఅధికారులుకేటాయించినపనినివిధిగానిర్వహించవలెను

జిల్లా కేంద్ర గ్రంధాలయం:-
ఉపగ్రంధపాలకుడు :-  ఇతను జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శికి సహాయకారిగా ఉండును.జిల్లా గ్రంధాలయ సంస్థకు సంబంధించిన ఫైల్స్ ను పరిశీలించి కార్యదర్శి గారికి పంపవలెను.
1.       జిల్లా కేంద్ర గ్రంధాలయం లో పని చేస్తున్న వివిధ విభాగాలఫై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కలిగి ఉండును.
2.       సభ్యత్వాలను చేర్పించడం, ఉపసంహరణలను, ఆలస్య రుసుములు, సభ్యత్వరుసుమును ,జిల్లా గ్రంధాలయ సంస్థల నిధులకు జమచేయడం.
3.       ఆచూకి సేవా విభాగ గ్రంధపాలకునికి సహాయకారిగా సూచనలు, సలహాలను ఇవ్వడం.
4.       చదువరుల దగ్గర నిలిచిపోయిన పుస్తకాలను తిరిగి గ్రంధాలయానికి చేర్చడానికి తగిన చర్యలు తీసుకోవడం.
5.       సిబ్బంది ఫై పర్యవేక్షణ,విధుల కేటాయింపు చేయడం
6.       క్రింది సిబ్బంది పెట్టిన శెలవులు,ఇతర దరఖాస్తులను పరిశీలించి కార్యదర్శి గారికి పంపడం.
7.       నియమిత కాలంలో నివేదికలు తయారుకు తగిన సూచనలు జారీచేయడం, హాజరు పట్టికను తనిఖీ చేయడం.
8.       పుస్తకాలను తరగతుల(clasification) గా విభజించేపనిని నిర్వహించడం.
9.       సకాలంలో పంపవలసిన నివేదికలు తయారుచేయడానికి క్రింది స్థాయి గ్రంధపాలకుల సహాయాని తీసుకోవడం.
10.   గ్రంధపాలకులు గ్రేడ్ 2,3, తాయారు చేసే పట్టికల (కేటలాగ్ ) ల నిర్వహణ కార్యక్రమానికి పర్యవేక్షుకులు గా వుండటం.
11.   సిబ్బంది జీతములు,పత్రికల బిల్లులు తయారుచేయడం.
12.   ఫై అధికారుల అనుమతితో గ్రేడ్ 3 శఖా గ్రంధలయములు మరియు గుర్తింపు పొoదిన గ్రంధాలయములను తనిఖీ చేయడం.
13.   కొత్త పుస్తకాలను కొత్త పుస్తకాల నమోదు పుస్తకంలో నమోదుచేయడం (acqisition of books).
14.   వివిధ శాఖా గ్రంధాలయాలకు కేటాoచిన పుస్తకాలను పంపిణి చేయడం.
15.   యూనియన్ క్యాటలాగిoగ్ చేయడం >
16.   పుస్తకఎంపిక కమిటి నిర్వహించే సమావేశంనకు అజెండా తయారుచేయడంలో కార్యదర్శి గారికి సహాయకారిగా పనిచేయడం.
17.   పుస్తకాల కొనుగోలు సంబందించిన స్టాక్ ఫైల్స్ ని నిర్వహించడం మరియు ఇతనికి కేటాoచిన ఇతర పనులు నిర్వహించడం.

సహాయ గ్రంధపాలకులు/రెండవ శ్రేణి గ్రంధపాలకులు:-
1.       జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఉండే ఉపగ్రంధపాలకునికి సహాయకారిగా ఉండును.
2.       జిల్లా కేంద్ర గ్రంధాలయంలో అతనికి కేటాయించిన విభాగంలో విధులను నిర్వహించావలెను.
3.       ఉపగ్రంధపాలకునికి సహకారంతో పుస్తకాల వర్గీకరణ,సూచికరణలను తాయారుచేయడం.
4.       పుస్తకపు ఎంపిక కమిటికి అవసరమగు పుస్తకాల ఎంపికకు సంబందించిన పట్టికలను(బుక్ లిస్టులు) తాయారుచేయడం.
5.       కొత్తగా వచ్చిన పుస్తకాలకు గ్రంధాలముల వివరణ,పట్టిక,ఆధారగ్రంధముల పట్టిక ఉపయుక్తగ్రంధసూచిలను తయారుచేయడం(asecessining books with bibilography).
6.       పుస్తకాల తొలిగింపు, బెైడింగ్ చేయవలసిన పట్టికలను తయారుచేయడం మరియు ఇతనికి అప్పగించి పనులు చేయడం.
మూడవశ్రేణిగ్రంధపాలకులు:-
1.       జిల్లా కేంద్ర గ్రంధాలయం లో పనిచేస్తున్న ఉపగ్రంధపాలకునికి,సహాయగ్రంధపాలకునికి ఇతను సహాయకారిగా ఉంటాడు.
2.       జిల్లా కేంద్ర  గ్రంధాలయంలో ఉపగ్రంధపాలకుడు కేటాయించిన విభాగంలో తన విధులను నిర్వహించును.
3.       సాంకేతిక విభాగపు పనిలో ఉపగ్రంధపాలకునికి,సహాయగ్రంధపాలకునికిసహాయకారిగా ఉందును.
4.       పుస్తకాల వివరాలు తెలుపు పట్టికలను(క్యాటలాగింగ్ కార్డ్స్) తయారుచేయడం.
5.       కొత్త పుస్తకాల  నమోదు యూనియన్ క్యాటలాగ్ తయారుచేయడం పుస్తకాల ఎంపికకు సంభందించిన లిస్టులను తయారుచేయడంలో ఉప,సహాయగ్రంధపాలకులకు సహాయకుడిగా పనిచేయడం.
6.       పుస్తకాలను తరగతులుగా(క్లాసిఫికేషన్) వారిగా ర్యాకులలో అమర్చడం, చదువరుల నుండి తిరిగి వచ్చిన పుస్తకాలను తిరిగి ర్యాకులలో పేర్చడం.
7.       ఉప,సహాయగ్రంధపాలకులు కేటాoచిన పనులను చేయడం.
రికార్డ్అసిస్టెంట్:-
1.       జిల్లా కేంద్ర గ్రంధాలయం లో పని చేస్తున్నగ్రంధపాలకులకు సహాయకుడిగా పనిచేయడం.
2.       గ్రంధాలయంలో వున్నా పాతరికార్డ్ లను భద్రపరచడం/నిర్వహించడం
3.       చదువరులకు కావలసిన పాతదిన,వార,ఇతర పత్రికలను అందించడం మరియు ఇతనికి కేటాoచిన పనులను చేయవలెను
అటెండరులు:-
1.       .గ్రంధలయాధికారులకు,ఇతర ఉద్యోగులకు సహాయకారిగా వుంటాడు
2.       చదువరులకు పుస్తకాలను ,పత్రికలను చదవడానికి సంభందించిన వస్తువులను అందివ్వడం.
3.       పుస్తకలఫై దుమ్ము,ధూళి లేకుండా చూడటం
4.       ర్యాకులను సక్రమంగా అమర్చడం
5.       గేటురిజిస్టార్ నందు సంతకాలు చెపియ్యడం
6.       చదువరులు తిరిగివెళ్లు సమయంలో జాగ్రత్తగా గమనిoచడం.
7.       ఇతర కార్యాలయాలకు తపాలా చేరవేయడం ఇతర అప్పగించిన పనులు చేయడం.
వాచ్ మెన్ :-
1.       గ్రంధాలయoకు సంభందించిన పుస్తకాలు ,ఇతర ఆస్తికి నష్టంకలగకుండా కాపలా ఉండవలెను.