Tuesday, June 12, 2018

గ్రంధాలయ నిర్వహణ –కొన్ని విషయాలు



గ్రంధాలయ నిర్వహణ –కొన్ని విషయాలు

          జిల్లా గ్రంధాలయ సంస్థ సిబ్బంది గ్రంధాలయ నిర్వహణలో ఈ దిగువ ఉదాహరించిన నియమాలను విధి గా పాటించవలెను.
1.భాద్యతతో,చిత్తశుద్దితో, ఓర్పుతోగ్రంధాలయాని ప్రయోజనకరoగా నిర్వహించావాలనే ,విజ్ఞానకేంద్రంగా
    తీర్చిదిద్దివలెను.
2.గ్రంధాలయ సంస్థ తన ఉప నిబంధనలలో రూపొందించిన సెలవుదినములు , పని వేళల ప్రకారం  గ్రంధాలయాలను  తెరువవలెను .
3. i.  రెండుపూటల హాజరుపట్టికలో సంతకం చేయవలెను. అపట్టికలో సెలవుల వివరం వ్రాయవలెను.
ii. నిర్ణితవేళలకు , గ్రంధాలయానికి ఆలస్యంగా వస్తే సదరు ఆలస్యాన్ని హాజరు పట్టికలో నమోదు    చేయవలెను
iii.ఒక నెలలో మూడు పర్యాయములు ఆలస్యంగా వస్తే ఒక సాధారణ సెలవును కోల్పోతారు. సాధ్యమైనంత ముందుగా సాదారణ సెలవును పంపవలెను.
iv.సెలవు దరఖాస్తు స్వంతపోస్టేజి తో సర్తిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ తో సమర్పించవలెను .
v. పుస్తకాల విభాగం ముస్తే అ విషయం నోటిసుబోర్డు మీద వ్రాయాలి.
vi సాధారణ సెలవుల రిజిస్టర్ నిర్వహించావలెను ,సెలవు దరఖాస్తు సంస్థ కార్యాలయమునకు పంపేటపుడు ఉద్యోగికి సెలవు ఎంత నిల్వయున్నది ,ప్రస్తుతం కోరిన సెలవు ,ఇంకా ఎన్ని సెలవులు మిగిలినవి తెలుపవలెను.
vii. ఆర్జితసెలవు కనీసం 15 రోజుల ముందుగా సమర్పించవలెను సెలవు మంజూరు అయ్యాకె వాడుకోవాలి ,
1.       అన్ని పట్టికలు,ఉత్తరాలు తెలుగులోనే వ్రాయాలి. ఉత్తరప్రత్యుత్తరాలు కార్యదర్శి వారికే వ్రాయాలి ,కార్యాలయ రెఫరెన్స్ వుంటే విధిగా పేర్కొనాలి కోరిన సమాచారం సత్వరం పంపాలి. గ్రంధాలయానికి వచ్చే ఉత్తరాలు ఏరోజుకారోజు పట్టికలో నమోదు చేయాలి.
2.       ఈ దిగువన తెలిపిన నివేదికలను నిర్ణిత గడువులోపల గ్రంధలయ సంస్థ కార్యాలయానికి సమర్పించాలి.
ప్రతి నెల చివరి రోజు
1.       తెలుగు అధికారభాష నివేదిక
2.       నెలసరి ప్రగతి సమీక్షా పట్టికలు
3.       బుక్స్ ఆన్ డిమాండ్ పట్టిక వివరములు
4.       ట్రేజరీ చెలానా వివరములు
 ప్రతి మార్చి ,జూన్ ,సెప్టెంబర్ ,డిసెంబర్ నెలల చివరిరోజు
1.       అభివృద్ధి నివేదిక
2.       వర్గీకరణ – సుచీకరణ
మార్చి అంతంలో సమర్పించాలిసిన వార్షికనివేదిక
1.       పరిపాలన నివేదిక
2.       ఆదాయపు పన్ను సమర్పించుట (ఫిబ్రవరి నెల అంతం లో )
౬తగిన కారణం లేకుండా ముందుగా అనుమతి లేకుండా ప్రధాన కర్యాలయంకు రాకూడదు .